Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu : వారికి శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Chandrababu : వారికి శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh housing scheme :ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వేగవంతంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలతో పాటు, ఇళ్ల స్థలం కూడా లేని నిరుపేదల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమిని కేటాయించాలని అధికారులకు సూచించారు. భూ లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో ‘గ్రూప్ హౌసింగ్’ విధానంపై దృష్టి సారించాలని కూడా ఆయన ఆదేశించారు.

- Advertisement -

ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పనులు వేగవంతం కావడంతో, దసరా పండుగకు 3 లక్షల గృహప్రవేశాలు జరిగేలా లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాదు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

ఈ గృహ నిర్మాణ పథకానికి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 తో అనుసంధానం చేయాలని నిర్ణయించడంతో, లబ్ధిదారులకు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఎస్సీ, బీసీ వర్గాలకు రూ. 50,000, ఎస్టీ వర్గానికి రూ. 75,000 చొప్పున అదనపు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందిస్తోంది.

అయితే, సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్ధిదారులకు ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని, వారికి భవిష్యత్తులో కొత్త పథకాల్లో చోటు కల్పించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపును ఇవ్వడమే కాకుండా, నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad