Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CPI Narayan Hot Comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ ఓ ...

CPI Narayan Hot Comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ ఓ “ఊసరవెల్లి”

CPI Narayan Hot Comments: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్, ఇప్పుడు బీజేపీ, టీడీపీతో జతకట్టడంతో నారాయణ ఆయనపై విమర్శల దాడిని మరింత పెంచారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో నారాయణ పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అగ్గి రాజేశారు.

- Advertisement -

‘బఫూన్’, ‘ఊసరవెల్లి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్‌ను “ఊసరవెల్లి” , “బఫూన్” అంటూ తీవ్ర పదజాలంతో నారాయణ విమర్శించారు. పవన్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతారని, ఆయనకు కనీసం జంతువులకు ఉండే విశ్వసనీయత కూడా లేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, సనాతన ధర్మంపై మాట్లాడటంపై కూడా నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితి మంటల్లో వేయడం. మరి నువ్వు చనిపోతే నీ పెళ్లాం కూడా తగలబడుతుందా? అంటూ పవన్ కల్యాణ్‌ను నారాయణ ప్రశ్నించారు. బ్రిటిష్ వారు రద్దు చేసిన చట్టాల గురించి మాట్లాడుతూ పవన్ సనాతన ధర్మాన్ని సమర్థించడంపై ఆయన విరుచుకుపడ్డారు.

Ys. Jagan : అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ షాక్

సోషల్ మీడియాలో విమర్శల దాడి
నారాయణ ప్రసంగం వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ నాయకుడి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో దిగజారుడు తనానికి నిదర్శనమని పవన్ అభిమానులు వాదిస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై నారాయణ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad