Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం అల్పపీడనంగా మారింది. పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్‌పై ఉన్న వాయుగుండం పశ్చిమ- వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
ఈ క్రమంలో ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
రెండు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఐఎండీ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:Holidays: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్..ఆగస్టులో సెలవులే..సెలవులు

