Homeఆంధ్రప్రదేశ్Covid : ఏపీలో మరో రెండు కొవిడ్ కేసులు

Covid : ఏపీలో మరో రెండు కొవిడ్ కేసులు

Andhra Pradesh: ఏపీలో రోజురోజుకి కొవిడ్‌ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొత్త కేసులను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 9 మందిని పరీక్షించగా..వారిలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -

28 యాక్టివ్ కేసులు…

వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 28 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. గత రెండు నెలల కాలంలో రాష్ట్రంలో 61 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 29 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 28 మంది చికిత్స, ఐసోలేషన్‌లలో ఉన్నారు. జూన్ 24 నుంచి ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా ఏపీలో నలుగురు చనిపోయినట్లు అధికారులు నిర్థారించారు.

మరోవైపు విశాఖలో అత్యధికంగా 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. ఇక్కడ ఐదు కొవిడ్ కేసులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో నాలుగు, ఎన్టీఆర్, విజయనగరం జిల్లాలలో రెండేసి కేసులు ఉన్నాయి. అల్లూరి, కాకినాడ, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాలలో ఒక్కో కేసు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి, కడప, కృష్ణా జిల్లాల్లో కొవిడ్ యాక్టివ్ కేసులు లేవు.

మరోవైపు వైఎస్సార్ కడప జిల్లాలో తొలిసారిగా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకూ ఏపీలోని 15 జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది.

Also Read:Ap:మరో మూడు రోజులు వానలు..40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News