Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Andhra Premier League 2025 : విశాఖలో APL 4 గ్రాండ్ ఓపెనింగ్.. అంబాసిడర్ గా...

Andhra Premier League 2025 : విశాఖలో APL 4 గ్రాండ్ ఓపెనింగ్.. అంబాసిడర్ గా టాలీవుడ్ స్టార్ హీరో

Andhra Premier League 2025: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (Andhra Premier League 4) నాల్గవ ఎడిషన్ శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానుందని ఏపీఎల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సినీ నటుడు వెంకటేశ్ ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ALSO READ : BCCI: బీసీసీఐకి మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్ సలహా..!

విజేత జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.25 లక్షల నగదు బహుమతి లభిస్తుందని రంగారావు వెల్లడించారు. అండర్-16 క్రీడాకారులకు కూడా అవకాశం కల్పించామని, ప్రతిభ చూపిన వారికి ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ మ్యాచ్‌లలో డీఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించామని, మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వివరించారు.

ALSO READ : Shubman Gill: శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. ఏకంగా నాలుగోసారి ఆ ఐసీసీ అవార్డుకు ఎంపిక!

పోటీలో సింహాద్రి వైజాగ్, తుంగభద్ర వారియర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్‌షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ రాష్ట్రంలో క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు, యువ క్రీడాకారులకు వేదికగా నిలుస్తుందని రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad