Tuesday, January 7, 2025
Homeఆంధ్రప్రదేశ్Anitha: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే.. పిల్లలను కూడా పక్కన పెడతా: అనిత

Anitha: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే.. పిల్లలను కూడా పక్కన పెడతా: అనిత

విశాఖ సెంట్రల్‌ జైలును హోంమంత్రి అనిత(Home Minister Anitha) సందర్శించారు. ఇటీవల జైల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా వార్తల్లో విశాఖ సెంట్రల్ జైల్ నిలుస్తోందన్నారు. గంజాయి సరఫరా జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. విచారణలో భాగంగా కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

తనిఖీల్లో భాగంగా సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కూడా కనిపించిందని.. దీనిపై విచారణ చేస్తామన్నారు. జైలు వార్డర్లు యూనిఫామ్‌లో ఆందోళన చేయడం సరైంది కాదన్నారు. రూల్ ప్రకారమే బదిలీలు జరిగాయని స్పష్టం చేశారు. దొరికిన సెల్ ఫోన్లు ఎవరివి అనే దానిపై విచారణ కొనసాగుతుందన్నారు.

ఇక తన పీఏ సంధు జగదీష్‌ అవినీతి ఆరోపణలపైనా ఆమె స్పందించారు. ‘నా ప్రైవేట్ పీఏపై ఆరోపణలు వచ్చాయి. నేను జీతం ఇచ్చి పెట్టుకున్నాను. అవినీతి ఆరోపణలపై చాలా సార్లు హెచ్చరించాను. అయినా పద్ధతి మార్చుకోలేదు. అందుకే తొలగించాను. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటే నా పిల్లలను కూడా పక్కన పెడతాను’ అని అనిత వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News