Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Governor Post : చంద్రబాబుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ

Governor Post : చంద్రబాబుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ

TDP: ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం కీలక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా, టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో కీలక నియామకాలలోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో రెండు పదవులు దక్కించుకున్న టీడీపీ, ఇప్పుడు మరో గవర్నర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

కొత్తగా గవర్నర్ పదవి ఎవరికి?
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఇప్పటికే గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు రెండో గవర్నర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అశోక్ గజపతి రాజుకు ఉత్తరాంధ్ర నుంచి అవకాశం దక్కినందున, ఈసారి రాయలసీమకు చెందిన బీసీ నేతకు ఈ పదవి ఇవ్వవచ్చని చర్చ జరుగుతోంది.

Chandrababu : వారికి శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

కీలక నేతల పేర్లు పరిశీలనలోకి..
రాయలసీమ నుంచి ఈ పదవికి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి, పార్టీకి ఎంతో సేవ చేశారు. అయితే, ఆయన కుమారుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉన్నందున, కేఈ కృష్ణమూర్తికి ఈ పదవిని ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ కూడా ఉందా?
గవర్నర్ పదవితో పాటుగా, కేంద్రంలో మరిన్ని కీలక నియామకాలలోనూ టీడీపీ నేతలకు అవకాశం లభించవచ్చని సమాచారం. టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగవచ్చనే ఊహాగానాలు నేపథ్యంలో, కేంద్రంలో మరో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఎన్డీఏలో ఉన్న ప్రాధాన్యతను మరోసారి చాటి చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad