Homeఆంధ్రప్రదేశ్MLC Anantha babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి చుక్కెదురు.. బెయిల్‌ తిరస్కరించిన రాజమండ్రి కోర్టు

MLC Anantha babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి చుక్కెదురు.. బెయిల్‌ తిరస్కరించిన రాజమండ్రి కోర్టు

MLC Anantha Babu bail rejects in Rajahmundry court: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి గట్టి షాక్‌ ఎదురైంది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే పలు మార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా రిజెక్ట్‌ అయ్యింది. తాజాగా, ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు తిరస్కరిస్తూ బిగ్‌ షాకిచ్చింది. నిందితుడు అనంతరబాబుకు నేరచరిత్ర, రాజకీయ నేపథ్యం ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో వాదనలు వినిపించారు. ప్రత్యేక పీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్లు వరుసగా రిజెక్ట్‌ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

Also Read: Devotion : మీరాలం మండిలో మహంకాళికి మహోత్సవం..15 క్వింటాళ్లతో శాకంబరి పూజల వైభవం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News