Cyclone: మాండౌస్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. తుపాను ప్రభావంతో ఈదురు గాలులు వీడంతో, కోతకొచ్చిన వరి నేల వాలింది. రైతులకు పంటనష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పలుజిల్లాల్లోన లోతట్టు ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా జలమయం అయ్యాయి. ప్రస్తుతం మాండౌస్ తుపానుతో ఏపీలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తుపాను బలహీనపడటం కొంత ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే వారం రోజుల్లో మరో తుపాను గండం పొంచిఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈనెల 13న ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాతి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఇది మరింతగా బలపడి ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా శ్రీలంకను ఆనుకుని వున్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని డెల్టా జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించారు.
ఈనెల 12, 13 తేదీల్లో లక్షదీవులు, కేరళ, కర్ణాటక కోస్తాతీర ప్రాంతాలతో పాటు దానిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో దక్షిణ తూర్పు , మధ్య పశ్చిమ ప్రాంతమైన అరేబియా సుమద్రంలో గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దీంతో ఈనెల 16 తరువాత వారం రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.