Homeఆంధ్రప్రదేశ్Hall Tickets: టెన్త్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

Hall Tickets: టెన్త్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

10th Hall Tickets: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బోర్డు కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు తాజాగా విడుదల చేశారు. మే 25 నుండి జూన్ 4 వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

- Advertisement -

హాల్‌టికెట్లు ఎలా పొందాలి?: విద్యార్థులు తమ హాల్‌టికెట్లను పాఠశాలల ద్వారా లేదా నేరుగా ఆన్‌లైన్ ద్వారా కూడా సులువుగా పొందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా పాఠశాలల లాగిన్‌ల ద్వారా ప్రధానోపాధ్యాయులు (HM) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవచ్చు. విద్యార్థులు నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also read-LAWCET: ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

మనమిత్ర వాట్సప్ నంబర్ ద్వారా సైతం: ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా హాల్‌టికెట్లను పొందే అవకాశం కల్పించారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు తమ మార్చి 2026 నాటి టెన్త్ హాల్ టికెట్ నెంబర్, అలాగే పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని.. వాటిలోని పరీక్షా కేంద్రం వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News