Sunday, August 18, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: 42 కోట్లతో కాకినాడ జిజిహెచ్ లో ఎంసిహెచ్ భవనం

AP: 42 కోట్లతో కాకినాడ జిజిహెచ్ లో ఎంసిహెచ్ భవనం

కాకినాడ జిజిహెచ్ లో 42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసిహెచ్) భవనాన్ని నిర్మించేందుకు, వైద్య పరికరాల్ని ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖతో రంగరాయ మెడికల్ కాలేజ్ అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ ఎంకానా) ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు ఆధ్వర్యంలో డిఎంఇ డాక్టర్ వినోద్ కుమార్ తో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంగళగిరిలోని ఎపిఐఐసి భవనం ఆరో ఫ్లోర్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు ఛాంబర్లో ఆర్ ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ మెడికల్ కాలేజ్ రెండో బ్యాచ్ కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్ర నాధ్ (ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్), డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్వీ లక్ష్మీ నారాయణ, కాకినాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు.  ఎంసిహెచ్ భవన నిర్మాణానికి ముందుకొచ్చిన రంగరాయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (ఆర్ ఎంకానా) ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

నాడు-నేడు పథకం  కింద సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాల్ని స్ఫూర్తిగా తీసుకుని తాము ముందుకొచ్చామని ఆర్ ఎంకానా ప్రతినిధులు తెలిపారు. కాకినాడ జిజిహెచ్ లో 20 కోట్లతో ఎంసిహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్లను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సూచనల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ఆధ్వర్యంలో ఆర్ ఎంకానా తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని డిఎంఇ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఐఎఎస్ అన్నారు.  

18 నెలల్లో ఎంసిహెచ్ భవనాన్ని నిర్మించి పూర్తి స్థాయి సౌకర్యాలతో ఆర్ ఎంకానా ప్రభుత్వానికి అందజేస్తుందన్నారు. అధునాతన సౌకర్యాలతో కూడిన మాతా శిశు సంరక్షణ సేవలు , నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అందుబాటులోకొస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 12 ల్యాబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీ నేటల్ వార్డు , 2 ఎమెర్జగన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్లో 75 పడకల పోస్ట్ నేటల్ వార్డు, రెండో ఫ్లోర్లో 2 అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు నాలుగు ఫ్లోర్లలో నియోనేటల్ వార్డు వంటి సౌకర్యాలు సమకూరనున్నాయి. వెంటిలేటర్, ఫోటో థెరపీ సదుపాయాలు అందుబాటులోకొస్తాయి. వచ్చే నెలలో సివిల్ వర్క్స్ ను ప్రారంభించి 2024 డిసెంబర్ నాటికి అంటే 18 నెలల్లో నిర్మాణపు పనులన్నీ పూర్తి చేసి ఎంసిహెచ్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సుమారు 1.50 లక్షల చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో ఎంసిహెచ్ భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించనున్నారు. నాడు-నేడు పథకానికి వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన కు సిఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టగా అందులో భాగంగా అభివృద్ధి పనులకు కొనసాగింపుగా కాకినాడ జిజిహెచ్ లో ఎంసిహెచ్ భవనం నిర్మాణానికి ఆర్ ఎంకానా తో ఎంవోయూ కుదుర్చుకోవడం ముదావహమని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మొవ్వా తిరుమల కృష్ణబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News