Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

AP: ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

ఈనెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. ఈపరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

- Advertisement -

వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడం తోపాటు తగిన పస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. 20-25 పరీక్షా కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్సు సేవలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పారు.
ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నాపత్రాలు లీకేజి లేదా మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టించి విద్యార్థులను ఆందోళనలకు గురిచేసే ప్రయత్నాలు జరుగు తుంటాయని అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరీక్షలు జరిగే సమయంలో
ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఒక నోడలు అధికారిని నియమించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో సమన్వయం కలిగి ఉండేలా చూడాలన్నారు.
కాగా రానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 10 లక్షల 3వేల 674 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.వారిలో 4 లక్షల 84 వేల 12 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు,5 లక్షల 19 వేల 662 మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారు.పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12గం.ల వరకూ జరుగుతాయి.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News