ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత సభ రేపటికి వాయిదా పడుతుంది. సభ వాయిదా వేసి, తర్వాత బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బిజినెస్ పై సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల అజెండాను నిర్ణయించనున్నారు. ఈసారి సమావేశాలు మూడు వారాల పాటు సాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈసారి సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరుకానుండటంతో సమావేశాలు వాడివేడిగా సాగుతాయనే అంచనాలున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలంతా హాజరవ్వటంపైనే అందరి దృష్టి ఫోకస్ అయి ఉంది.
AP Assembly live: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
జగన్ హాజరు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES