Tuesday, November 26, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: షెడ్యూల్డు కులాల సంక్షేమంపై సుదీర్ఝంగా చర్చించిన శాసన సభ కమిటీ

AP: షెడ్యూల్డు కులాల సంక్షేమంపై సుదీర్ఝంగా చర్చించిన శాసన సభ కమిటీ

షెడ్యూల్ కులాల ప్రగతిని పరిశీలించిన భేటీ

రాష్ట్ర శాసన సభ షెడ్యూల్డు కులాల సంక్షేమ కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ గొల్లా బాబురావు అద్యక్షతన వెలపూడిలోని శాసన సభ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయల్, పోతుల సునీత, అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణి ఈ కమిటీ సమావేశ ప్రారంభోపన్యాసం చేస్తూ కమిటీ విధివిధానాలు, నిర్వర్తించవలసిన కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఉప కార్యదర్శి సుబ్బా రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -
అనంతరం కమిటీ చైర్మన్ గొల్లా బాబు రావు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేం జరిగింది.  పట్టణాభివృద్ది, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం మరియు విద్యా శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  షెడ్యూల్డు కులాల సంక్షేమం, అభివృద్దికి ఆయా శాఖలు అమలు చేస్తున్న పలు పనుల ప్రగతిని సమీక్షించారు. శాఖల వారీగా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని ఆయా శాఖల అధికారులకు  ఆయన సూచించారు. 
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News