Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?

AP Assembly: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?

AP Assembly| ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్‌(Budget)ను ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు.

- Advertisement -

రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ. 68,742.65 కోట్లుగా వెల్లడించారు.

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

ఆరోగ్య రంగం – రూ.18,421 కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి – రూ.16,739 కోట్లు
ఉన్నత విద్య – రూ.2,326 కోట్లు
పాఠశాల విద్య – రూ.29,909 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు – రూ.11,855 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.39,007కోట్లు
మైనార్టీల సంక్షేమం – రూ.4,376 కోట్లు
మహిళా శిశు సంక్షేమం – రూ.4,285 కోట్లు
మానవ వనరుల అభివృద్ధి – రూ.1,215 కోట్లు
పట్టణాభివృద్ధి – రూ.11490 కోట్లు
గృహ నిర్మాణం – రూ.4,012 కోట్లు
జలవనరులు – రూ.16,705 కోట్లు
పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ.687 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,127 కోట్లు
ఇంధన రంగం – రూ.8,207 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు – రూ.9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికం – రూ.322 కోట్లు
పోలీస్ శాఖ – రూ.8,495 కోట్లు

కాగా బడ్జెట్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News