Thursday, November 14, 2024
Homeఆంధ్రప్రదేశ్Ayyannapatrudu: అసెంబ్లీలో భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

Ayyannapatrudu: అసెంబ్లీలో భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

Ayyannapatrudu| ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో భోజనం బాలేదంటూ అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సభ వాయిదాపడ్డాక మధ్యాహ్నం భోజనం సమయంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ క్యాంటీన్‌లో భోజనం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు భోజనం అసలు బాలేదంటూ స్పీకర్‌కు ఫిర్యాదుచేశారు.

- Advertisement -

దీంతో ఇంటికి బయలుదేరిన ఆయన.. మళ్లీ అసెంబ్లీకి వచ్చి అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలంటే తమాషాగా ఉందా? భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా చెప్పారా? అంటూ ధ్వజమెత్తారు. మీ ఇష్టానుసారంగా చేస్తారా? పద్దతి మార్చుకోవాలంటూ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్‌పై ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోవాలని ఇకపై భోజనం బాగా చేయాలని ఆదేశించారు. మరోసారి ఇదే రిపిట్ అయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదాపడ్డాయి. బడ్జెట్ పత్రాలపై శాసనసభ్యులు అవగాహన పెంచుకునేందుకు ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News