Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: బోయ, వాల్మీకులను చేరిస్తే గిరిజనులు చితికిపోవడం ఖాయం

AP: బోయ, వాల్మీకులను చేరిస్తే గిరిజనులు చితికిపోవడం ఖాయం

వెనుకబడిన వర్గాల గిరిజనులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తున్నామని తీర్మానం చేయడం అణగారిన వర్గాల బతుకులతో ఆడుకోవడం సరికాదని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి గిరిజన మేధావుల సదస్సు ‘చలో విజయవాడ’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్న గిరిజనులపై మరో వ్యక్తులను తీసుకొచ్చి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం సరికాదన్నారు. ఎస్టిలో ఇతరులను చేర్చితే రాజకీయ, సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులు వారి చేతిలో చితికిపోవడం ఖాయమన్నారు.

- Advertisement -

మరో మారు బ్రిటిష్ పాలనాల అణగారిన వర్గాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నారన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలు, కులవృత్తుల, వేష భాష, కలిగిన గిరిజనులలో ఇతర కులాలను చేర్చడం సరికాదన్నారు.అందరూ కలిసికట్టుగా సంఘటితమై ఈనెల14వ తేదీన విజయవాడ మహానగరంలో జరిగే రాష్ట్రస్థాయి గిరిజన మేధావుల సదస్సును జయప్రదం చేసి విజయవంతం చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. పార్టీలకు, సంఘాలకు, రాజకీయాలకు, అతీతంగా జరిగే ఈ సదస్సును మేధావులు, ఉద్యోగులు, యువకులు, మహిళలు, డాక్టర్లు, టీచర్లు ప్రతి ఒక్కరు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తపరచాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిపిఎస్ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, ఉద్యోగుల సంఘం నాయకులు బద్దు నాయక్, టీచర్ మత్రు నాయక్, ఏబి తాండ దేవా నాయక్, కోత్తరామాపురం నాగ స్వామి నాయక్, ఎస్ ఎన్ తండా రాము నాయక్, కటారి నాయక్, కే రంగస్వామి నాయక్, రుద్రవరం వెంకటేశ్వర నాయక్, అంకారావు, విక్రమ్ నాయక్, స్వామి నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News