రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో బడ్జెట్ రూపకల్పనపై సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, ఈమేరకు బడ్జెట్ రూపకల్పనపై పయ్యావుల బృందం శ్రమిస్తోంది. వివిధ శాఖలతో కీలక భేటీలు నిర్వహిస్తూ, అంచనాలపై కసరత్తు సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశ పెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావటంతో అందరి దృష్టి ఏపీ బడ్జెట్ పై ఫోకస్ అవుతోంది.
- Advertisement -
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/36130eeb-2bed-4891-8596-a860a854a70f-1024x622.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/73abdf09-e223-434c-8365-692e926c6afc-1024x621.jpg)