ఏపీ బడ్జెట్ సమావేశాలకు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్‌ను కూడా ఇప్పటికే విడుదల చేశారు.
మార్చి 3న బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 22, 23న అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాల్లో భాగంగా మార్చి 3వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 27న ఎన్నిక జరగనుంది. వీటి ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి.