ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు బుగ్గనరాజేంద్రనాధ్ రెడ్డి, బేతంచెర్ల పట్టణంలోని 3వ కౌన్సిల్ వార్డు, ఉప్పునీళ్ల ట్యాంక్ దగ్గర,40 లక్షలు రూపాయల వ్యయంతో నూతన డిజిటల్ గ్రంధాలయమునకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మిస్తున్న డిజిటల్ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు, ఉద్యోగులు నిరుద్యోగులు, వృద్ధులు మహిళలు ప్రజలందరూ, గ్రంధాలయానికి వెళ్లి, గ్రంథాలయంలో లభించే పుస్తకాలు చదివి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, గ్రంధాలయ అభివృద్ధికి పాటుపడాలని, పెద్దలు, చదువుకున్నటు వంటి పిల్లలను కూడా గ్రంధాలయంలో చదువుకొంటే మంచి విద్యావంతులుగా, మేధావులుగా ఆలోచనా సరళి పెంపొందించుకొనుటకు గ్రంధాలయ పఠనం చాలా ఉపయోగపడుతుందని, ఆందరూ ఈ గ్రంధాలయంలో చదువుకొని, సన్మార్గంలో నడుచుకొనుటకు, ఈ సరస్వతి నిలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మంత్రితోపాటు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్, బిసిసంఘం రాష్ట్ర నాయకులు బత్తుల లక్ష్మీకాంతయ్య, బ్రహ్మానందాచారి, బేతంచెర్ల మండల తహసీల్దార్ నరేంద్రనాధ్ రెడ్డి,బేతంచెర్ల ఎంపీపీ బుగ్గననాగభూషణం రెడ్డి, బేతంచెర్ల నగరపంచాయితి చైర్మన్ సిహెచ్ చలంరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు బాబురెడ్డి, బుగ్గనచంద్రారెడ్డి ముర్తుజావలి, గూని నాగరాజు, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ, బేతంచెర్ల వార్డుకౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వివిధగ్రామాల సర్పంచులు, వైసీపీ నాయకులు,జిల్లా, బేతంచెర్ల మండల అధికారులు, బేతంచెర్ల గ్రంథాలయాధికారి మధు శేఖర్ రంగాపురం లైబ్రరియన్ శివయ్య, కాంట్రాక్టర్స్ ఖాదర్ బాషా, వై రాజేంద్రనాథ్ రెడ్డి, బలరాం రెడ్డి, పాఠకులు నాగేశ్వర నాయుడు శ్రీనివాసులు తిమ్మారెడ్డి వేణుగోపాల్ ఆలకుంట్లమధు, వంకదారి కుమారయ్య, భాస్కర్, దేవనూరు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.