Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP Cabinet approves investments worth Rs. 2 lakh crore: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కేబినెట్‌ సమావేశంలో 40కి పైగా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి కంపెనీలు, వాటికి సంబంధించిన 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, భారీ సోలార్‌ ప్రాజెక్టులు, పంప్డ్‌ స్టోరేజ్‌, బయోగ్యాస్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుమతించింది. శుద్ధ ఇంధన రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా క్యాబినెట్‌ కీలక చర్యలు తీసుకుంది. మరోవైపు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, ఆటోమొబైల్‌, సిమెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడుల ఆమోదంపైనా చర్చించింది. కర్నూలు విమానాశ్రయం పీపీపీ మోడల్‌లో అభివృద్ధి ప్రతిపాదన సైతం కేబినెట్‌లో చర్చకు వచ్చింది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపైనా క్యాబినెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎంఈలకు నిధుల సౌలభ్యానికి ప్రత్యేక ఏర్పాటుపై, సాగునీటి కాల్వల విస్తరణ, రోడ్లు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. మొత్తం మీద రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల రాకతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/work-from-home-2-days-a-week-in-delhi/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News