HomeTop StoriesAP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet approves several key decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం సుమారు 3 గంటలపాటు కొనసాగిన క్యాబినెట్‌ భేటీలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం కొన్ని కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా నదీ తీరంలో ‘అమరావతి ఐ’ అనే కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ఆహ్వానానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌ రిజర్వాయర్ల కేజ్‌ కల్చర్‌ పాలసీ- 2025 ముసాయిదాకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. మడ్డువలస, ఏలేరు రిజర్వాయర్లలో కేజ్‌ కల్చర్‌ యూనిట్ల ఏర్పాటు ఆమోదం తెలిపింది.

- Advertisement -

Also read: CM Revanth: పాలమూరు పర్యటనలో సీఎం.. మక్తల్‌ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలన

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు..

1. ఏపీ ఏవియేషన్‌ పాలసీ-2026కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
2. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు.
3. మానవ అవయవాల మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్‌ జారీ, ప్రతిపాదనకు ఆమోదం.
4. విశాఖ, చీరాలలో బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుకు అనుమతించింది. దీనికి వీలుగా ఎక్సైజ్‌ పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది.
5. పోలవరం సహా రాష్ట్రంలో కొనసాగుతున్న ఇతర సాగునీటి ప్రాజెక్టు పనులకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
6. హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం కోసం ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వ హామీ.
7. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచింది.
8. జులై 1 నుంచి వీబీ-జీ-రాంజీ అమలుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.
9. అమరావతితో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్‌ సిగ్నల్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News