Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన? రాబోయే కొత్త మంత్రి ఇతనే!!

AP Cabinet: ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన? రాబోయే కొత్త మంత్రి ఇతనే!!

AP Cabinet Meeting: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై పలు సర్వేలు నివేదికలు ఇచ్చాయి. ఈ సారి గెలిచిన వారిలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు 2029లో తిరిగి గెలవడం కష్టమని అంచనాలు వచ్చాయి. వీరితో పాటు మంత్రుల పనితీరుపైనా ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. క్యాబినేట్‌లో పలువురు మంత్రులు సైతం రెడ్ జోన్‌లో ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన క్యాబినేట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

అంచనాలకు తగినట్లుగా పనిచేయని మంత్రులపై వేటు పడుతుందనే సంకేతాన్ని సీఎం చంద్రబాబు ఇచ్చినట్లు అయ్యింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇదే కాకుండా జనసేన ఎమ్మెల్సీ నాగబాబును క్యాబినేట్‌లో తీసుకుంటామని చంద్రబాబు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మంత్రి వర్గంలో మార్పులు తప్పవు అనిపిస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరికైనా ఎసరు పడుతుందో లేదా నాగబాబును చేర్చుకొని విస్తరిస్తారో చూడాలి.

ఈ విధంగా చూస్తే ఏపీ క్యాబినేట్ లో ప్రక్షాళన జరిగితే మంత్రుల్లో ఎవరిపై వేటు పడుతుందో అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏ శాఖలో కోత పడుతుందో అనే విషయంపై తెలుగు దేశం పార్టీకి సన్నిహితంగా ఉండే వారు కొన్ని అంచనాలను వెల్లడించారు. ప్రముఖ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట క్యాబినేట్‌లో తన అంచనాల్సి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రమాణం చేయనున్న వారి పేర్లను సైతం సోషల్ మీడియాలో బయటపెట్టారు. ఏఏ శాఖల మంత్రులపై వేటు పడుతుందో.. ఆశావహులు ఎవరో వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad