ఏపీ కేబినెట్ (AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదం
లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం
ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం
స్పోర్ట్స్, పర్యాటక పాలసీలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ టవర్ కార్పొరేషన్ ఫైబర్‌గ్రిడ్‌లో విలీనం
కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్ ల పునరుద్ధరణ
దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా.. చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం