రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ముగిసింది. ఈ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని.. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులు పునఃపరిశీలిస్తామన్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి
45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతి
475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం.
1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి
బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు ఆమోదం
పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి
పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం
క్లీన్ ఎనర్జీ కోసం ఎన్‌టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు
జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి ఆమోదం
ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం
రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటు