సచివాలయంలో జరిగిన సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(AP Cabinet) ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో భూకేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. నంబూరులో వీవీఐటీకి ప్రైవేట్ వర్సిటీ హోదా, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీ లో, రూ.25,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు, బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1,175 కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

ఇక సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్ అప్ పాలసీ 4.0 కి ఆమోద ముద్ర వేశారు.