Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఏపీ కేబినెట్ భేటీ హైలైట్స్ ఇవే

AP: ఏపీ కేబినెట్ భేటీ హైలైట్స్ ఇవే

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో జరిదిన రాష్ట్ర మంత్రి మండలి ఆస్కార్‌ సాధించిన నాటు…నాటు.. పాట రూపకల్పన చేసినవారికి, ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు కేబినెట్‌ అభినందనలు తెలిపింది. ఇక ఇటీవలే జరిగినగ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి కృషిని ప్రశంసిస్తూ తీర్మానం పెట్టారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. హర్షధ్వానాలతో మంత్రివర్గ సభ్యులు దీన్నిఆమోదించారు. వచ్చే నెల ఏప్రిల్‌ 3న పెన్షన్లు పంపిణీ ఉందని, ఏప్రిల్‌ 1న బ్యాంకులకు సెలవు, రెండువ తేదీన ఆదివారం కావడంతో మూడో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సంక్షేమహాస్టళ్లలో విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు మరింత సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణ నిమిత్తం ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేందుకు నిర్ణయం.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్‌ రూల్స్‌ సవరణకు కేబినెట్‌ ఆమోదం. ఏపీ మహిళా కమిషన్‌ పదవీకాలానికి సంబంధించి ఏపీ వుమెన్‌ కమిషన్‌ యాక్టు –1998 సవరణలకు కేబినెట్‌ ఆమోదం. మహిళా కమిషన్‌ టెన్యూర్‌ను ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. ఏపీ కార్ల్‌– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్‌ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

- Advertisement -

ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్‌ వాచ్‌మెన్‌ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం. మొత్తం 5388 హైస్కూళ్లలో పేరెంట్స్‌ కమిటీద్వారా వాచ్‌మెన్‌ల నియామకం, ఒక్కొక్కరికి రూ.6వేల గౌరవ వేతనాన్ని టీఎంఎఫ్‌ నుంచి చెల్లించాలని నిర్ణయించారు.



రాష్ట్ర సమాచార మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News