AP Cabinet| సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కాసేపట్లో జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ(SIPB) భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుపై కూడా ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఇక రాజధాని అమరావతికి సంబంధించి.. గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు కూడా ఆమోదం చెప్పునుంది. ఈ పనుల కోసం కొత్తగా టెండర్లు పిలిచే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవే కాకుండా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.