Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు గుర్తించారు.

- Advertisement -

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధంగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌, అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆర్‌టీజీఎస్‌ ఏర్పాటుకు ఆమోదం
విద్యుత్‌ సుంకంలో టారిఫ్‌ల తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం
ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్‌ టారిఫ్‌ తగ్గింపు ప్రతిపాదనపై ఆమోదం
ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు రుణంపై ఆమోదం
ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు ఆమోదం
తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం
కడప జిల్లా సీకేదిన్నెలో 2,595 ఎకరాల బదిలీకి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad