Saturday, October 12, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే?

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం.. వైఎస్సార్‌ పశుబీమా పథకం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాసులు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్ లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదన​కు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.

- Advertisement -

ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రూ.2500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతున్నట్లు కేబినెట్ నిర్ణయించింది. వచ్చే నెల నుండి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఒకరకంగా పెన్షన్ దారులకు ఇది న్యూ ఇయర్ గిఫ్ట్. తాజాగా పెంచిన ఈ పెన్షన్ తో 62.31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. అదేవిధంగా.. వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు తరలించాలన్న నిర్ణయానికి, జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News