Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: మేం చెప్పుకోలేక నష్టపోయాం.. జగన్ మోసం చేశారు.. !

CM Chandrababu: మేం చెప్పుకోలేక నష్టపోయాం.. జగన్ మోసం చేశారు.. !

AP CM Chandrababu Announces About Nominated Posts: కష్టపడి పనిచేసిన వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కార్యకర్తలే తనకు ముఖ్యమని, త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని ఆయన తెలిపారు. శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ విషయాలను ఆయన వివరించారు.

- Advertisement -

గత ప్రభుత్వంపై విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులను మోసం చేశారని, రైతు భరోసా పేరుతో వంచనకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి మొత్తం రూ.20,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/home-minister-vangalapudi-anitha-about-ys-jagan-arrest-in-ap-liquor-scam/

కూటమి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి
గతంలో తాము చేసిన కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పుకోలేక నష్టపోయామని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. ఈ నెలలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాల ప్రారంభోత్సవంలో నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఆదేశించారు.

రైతులకు ప్రాధాన్యం, మహిళలకు సాధికారత
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తామని చంద్రబాబు వివరించారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళా సాధికారతకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-implements-new-srivani-darshan-timings-from-august-1/

నామినేటెడ్ పదవుల భర్తీ
త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను చేపడతామని చంద్రబాబు తెలిపారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు. పార్టీ క్యాడర్ ఐక్యంగా పనిచేసి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad