Saturday, November 15, 2025
HomeTop StoriesCM Chandra babu: దుబాయ్ పర్యటన సక్సెస్.. హైదరాబాద్‌కు చేరుకున్న ఏపీ సీఎం

CM Chandra babu: దుబాయ్ పర్యటన సక్సెస్.. హైదరాబాద్‌కు చేరుకున్న ఏపీ సీఎం

AP CM arrives in Hyderabad after Dubai Tour: ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందం ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాసాంధ్రులతో సైతం సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అదేవిధంగా నవంబర్ 14, 15న విశాఖపట్నం వేదికగా జరగబోతున్న CII ఇన్వెస్టర్స్‌ మీట్‌-2025కు పలువురు వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. దుబాయ్ పర్యటనలో భాగంగా తొలి రోజు సోభా గ్రూప్ వ్యవస్థాపకుడు పీఎన్‌సీ మెనాన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధి, పర్యాటకం, రియల్‌ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా అమరావతిలో ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మాణానికి మెనాన్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించారు.

- Advertisement -

రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా పర్యటన: షరఫ్ గ్రూప్ వైస్‌ చైర్మన్ షరఫుద్దీన్ షరఫ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. వారితే లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ సౌకర్యాలపై చర్చించారు. అనంతరం హింద్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రైల్వే, పోర్టు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో వేర్‌హౌసులు ఏర్పాటు చేయడానికి వారు ఆసక్తి చూపారు. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీలు మార్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం వారికి వివరించారు. ఇక ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ రామకృష్ణతో పోర్టుల అభివృద్ధి, షిప్ మేనేజ్‌మెంట్ వంటి సాగర సంబంధిత అవకాశాలపై సీఎం చర్చించారు. నంతరం సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా రోడ్‌షోలో సైతం సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించిన సీఎం: మూడు రోజుల దుబాయ్ పర్యటనలో భాగంగా చివరి రోజు టూరిజం పాలసీపై ఏపీ సీఎం అధ్యయనం చేశారు. అబుదాబీలో గల వైఎస్ ఐలాండ్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. ఫెరారీ వరల్డ్, వైఎస్ వాటర్‌ వరల్డ్, వార్నర్ బ్రోస్ వరల్డ్, సీ వరల్డ్ అబుదాబీ వంటి టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిశీలించారు. అనంతరం ఏపీలో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం.. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ప్రముఖులను కోరారు. చివరగా అబుదాబీలోని బాప్స్ హిందూ దేవాలయాన్ని సీఎం చంద్రబాబు బృందం సందర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad