Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

Allu Arjun: జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఫోన్ చేశారు. అరెస్ట్ ఘటనపై ఆరా తీశారు. అంతకుముందు బన్నీ తండ్రి అల్లు అరవింద్‌కు కూడా చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఇక పలువురు హీరోలు కూడా బన్నీకి ఫోన్లు చేశారు. ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(NTR), బాలకృష్ణ(Balakrishna) తదితర హీరోలు అల్లు అర్జున్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ప్రస్తుతం షూటింగ్‌లలో బిజీగా ఉన్నామని.. హైదరాబాద్ వచ్చాక కలుస్తామని చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

కాగా దర్శకులు కె.రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, హరీశ్ శంకర్, నిర్మాతలు నవీన్‌, రవి, దిల్‌రాజు, హీరోలు ఉపేంద్ర, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, రానా దగ్గుబాటి, ఆనంద్‌ దేవరకొండ తదితరులు బన్నీని కలిసిన సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించిన విషయాలతో పాటు తాజా పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా సుకుమార్ బన్నీని చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News