Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: ఏపీలో బెల్ట్ షాపులు ఇక కన్పించవు.. వందశాతం డిజిటల్ చెల్లింపులే.. సీఎం బాబు కీలక...

Chandrababu: ఏపీలో బెల్ట్ షాపులు ఇక కన్పించవు.. వందశాతం డిజిటల్ చెల్లింపులే.. సీఎం బాబు కీలక నిర్ణయం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలకు పూనుకున్నారు. ఇకపై అన్ని మద్యం దుకాణాల్లో 100 శాతం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నగదు లావాదేవీల వల్లే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆదాయార్జన శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిన సీఎం.. మద్యం అమ్మకాల విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కచ్చితంగా అమలు చేసే దుకాణాలకే భవిష్యత్తు కేటాయింపుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Read Also: Pakistan Team Reached for Practice:  పరువుపోగొట్టుకున్న పాక్.. యూఏఈతో మ్యాచ్ కి రెడీ

బార్ల ఏర్పాటులోని జాప్యంపై.. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో బార్ల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై కూడా అధికారులను చంద్రబాబు ఆరా తీశారు. మద్యం దుకాణాలతో పోలిస్తే బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16 శాతం అధికంగా ఉండటమే ప్రధాన సమస్య అని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మొదట పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత బార్ల ఏర్పాటుకు వెళ్లడం వల్ల కూడా సమస్యలు తలెత్తాయని కొందరు అధికారులు వివరించారు. దీని వెనుక ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని సీఎం సూచించారు.

ఎర్రచందనం ఆదాయంపై..

సమావేశంలో ఎర్రచందనం ద్వారా రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన ఎర్రచందనాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. ఎర్రచందనాన్ని నేరుగా అమ్మే బదులు, తిరుపతి డిపోలోనే బొమ్మలు వంటివి తయారు చేసి విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని సూచించారు. ‘జీఎస్టీ కొత్త శ్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఎంఆర్‌పీలో అది ప్రతిబింబిస్తోందో లేదో పరిశీలించాలని సీఎం కోరారు. జీఎస్టీ తగ్గింపు, ప్రజలకు ప్రయోజనాలు, ఇతర అంశాలపై నెల రోజుల పాటు ప్రచారం చేపడదాం. యోగా విషయంలో ఎలా చేశామో అలాగే చేద్దాం. బీమాపై జీఎస్టీ తగ్గించినందున ప్రభుత్వం కడుతున్న బీమా విషయంలోనూ ఆ ఫలితాలు పొందేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించండి’ అని చంద్రబాబు అన్నారు. ఇకపోతే, జీఎస్టీ వల్ల ప్రజలకు ప్రతి ఏటా నేరుగా రూ.8,000 కోట్ల మేర ప్రయోజనం దక్కుతుందని వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ బాబు చెప్పారు. జీఎస్టీ లైసెన్సుల రిజిస్ట్రేషన్లను సులభతరం చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ 3 రోజుల్లో పూర్తి చేస్తున్నందున మిగిలిన శాఖలూ అలాంటి అవకాశాలు పరిశీలించాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read Also: Viral Video: వామ్మో బుడ్డోడు ఇలా ఉన్నాడేంట్రా.. రెండు చేతుల్లో పాములు పట్టుకుని హల్చల్

ప్రభుత్వ రాబడి పెరగాలని..

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధికి అనుగుణంగా ప్రభుత్వ రాబడి కూడా పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని, తదుపరి సమావేశం నాటికి స్పష్టమైన ఫలితాలు చూపించాలని ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లాలో గనుల నుంచి ఆదాయం ఎందుకు బాగా తగ్గిందో చూడాలి. గనులు అన్ని చోట్లా ఒకే తరహాలో ఉండవు. జిల్లాలను 3 గ్రూపులుగా విభజించి పరిశీలించాలి. ఉచిత ఇసుక వల్ల రూ.1,000 కోట్లు ప్రతి ఏటా కోల్పోతున్నా ప్రజలకు సంతృప్తి స్థాయి తక్కువగా ఉంది. అవసరమైన మార్పులు చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad