CM Chandrababu Naidu: హోలీ పండుగను పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.
చెడుపై మంచి సాధించిన విజయం హోలీ: చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని జరుపుకునే కామ దహనంతో హోలీ వేడుకలు ప్రారంభమవుతాయని సీఎం గుర్తుచేశారు. ఈ పండుగ సమాజంలో ప్రేమానురాగాలను, ఐక్యతను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also read-Happy Holi: హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
సుఖసంతోషాలతో ఉండాలి: హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దాలని సీఎం కోరారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరూ తమ బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాట్లుగా సీఎం చంద్రబాబు తన సందేశంలో వివరించారు. ప్రజలందరూ పండుగను ఉత్సాహంగా, క్షేమంగా జరుపుకోవాలని కోరారు.
హోలీ పర్వదినం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. చెడు పై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.… pic.twitter.com/QeybJ2lbFX
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2026

