Saturday, November 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | ఫెంగల్ తుఫాన్ పై సీఎం సమీక్ష

Chandrababu Naidu | ఫెంగల్ తుఫాన్ పై సీఎం సమీక్ష

ఫెంగల్ తుఫాన్ (Fengal Cyclone) పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులను తుఫాన్ పై రివ్యూ చేసిన ఆయన.. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని అధికారులను చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు తెలియజేశారు. తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News