CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న పలు అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా ట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలపై చర్చించనున్నారు.
పాస్ పుస్తకాల పంపిణీ: రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో సీఎం చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,658 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనుండగా.. వేమూరు నియోజకవర్గంలో 1,795 మంది లబ్ధిదారులకు వీటిని అందజేస్తారు.
Also read-Gas cylinder: గుడ్ న్యూస్.. బుక్ చేసిన 2-3 రోజుల్లో సిలిండర్ డెలివరీ!
పార్టీ క్యాడర్‌తో సమావేశం: మధ్యాహ్నం వేమూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో పాటుగా కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. రాబోయే కాలంలో పార్టీ కార్యాచరణ, స్థానిక సమస్యలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో బాపట్ల జిల్లా యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం ఆయన తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు.

