Thursday, November 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Ap Politics : చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్లు

Ap Politics : చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్లు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి.. తాను రాజకీయాల్లో ఉండాలన్నా, మళ్లీ అసెంబ్లీకి వెళ్లాలన్నా ప్రజలు గెలిపిస్తే సరేసరి.. లేకపోతే ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

ఆఖరికి తాను కుప్పంలో కూడా గెలవలేనన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ పాలన చూసి రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకున్నారన్నారు. అప్పట్లో.. 1995లో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇంట్లోనూ, పార్టీలోనూ చంద్రబాబుకు స్థానమిచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబూ అనుకుని ఉంటారని వ్యగ్యంగా మాట్లాడారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్ విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad