AP CM Nara Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తమ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన ఉంటుందని తెలిపారు. డబ్బుతో పనిలేదని.. స్పందించే మనసుంటే చాలని.. పేదలకు అండగా నిలిచేందుకు అదే పెద్ద అర్హతని పేర్కొన్నారు. చిన్న సాయం అయినా సరే కష్టాల్లో ఉన్నవారికి అది కొండంత భరోసాని ఇస్తుందని, సరిగ్గా ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికంపై సరికొత్త యుద్ధానికి తెరతీసిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు ఆసక్తి ఉన్న మానవతావాదుల భాగస్వామ్యాన్ని జోడిస్తూ పీ4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 2029 నాటికి రాష్ట్రాన్ని పేదరిక నిర్మూల రాష్ట్రంగా మార్చడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 19 నుంచి ఈ కార్యక్రమం అమలవుతుందని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ycp-leader-bollapalli-threatened-to-vro-video-viral/
సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ కొన్ని కుటుంబాలకు నైపుణ్యం, మార్గ నిర్దేశం అవసరమని.. అందుకే ఆ లోటును మార్గదర్శకులు భర్తీ చేస్తారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల సైతం హాజరయ్యారు.
గుంటూరు జిల్లా అవనిగడ్డ కు చెందిన పారిశుద్ధ కార్మికురాలు హేమలత ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పిన సీఎం.. ఈ కార్యక్రమానికి ఆమె స్ఫూర్తి అని తెలిపారు. ఆర్థికంగా నిరుపేద అయినప్పటికీ తనకంటే కష్టాల్లో ఉన్న ఓ వృద్ధురాలికి అండగా నిలబడ్డారని, రోజు ఆమె ఇంటికి వెళ్లి సపర్యాలు చేస్తున్నారని, ఇంతకంటే గొప్ప మానవత్వం ఏముంటుందని తెలిపారు. డబ్బున్నవారే దానం చేయాలని ఏమీ లేదని.. ఆదుకోవాలని మనసు ఉంటే ప్రతి ఒక్కరూ మరొకరికి మార్గదర్శకం కావచ్చు అని చెప్పుకోచ్చారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ycp-leader-bollapalli-threatened-to-vro-video-viral/
ఇప్పటికే ఆర్థికంగా స్థిరపడిన వారు స్వచ్ఛందంగా తమకు తాము ముందుకు వచ్చి పేదరికంలో ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న కుటుంబాలకు సాయం చేయాలని, అలాంటి కుటుంబాలకు చేయూత ఇవ్వమని కోరారు. మార్గదర్శకులు ఎంపికలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, బలవంతాలు ఉండవని, తీసుకువచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా మానవత్వంతో ముడిపడిన కార్యక్రమం అని, మనసున్న వారే ముందుకు వస్తారని తెలిపారు. గతంలో సైతం జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొస్తే పలువురు విమర్శించారని.. దీన్ని కూడా అదేవిధంగా నీరు కార్చే ప్రయత్నం చేస్తారని, అన్నారు. కానీ ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని సీఎం తెలిపారు.


