AP Data Hub Challenges: ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం ఏఐ హబ్‌గా మారనుందా, పశ్చిమ తీరం నుంచి డేటా సెంటర్లు తూర్పు తీరానికి తరలిరానున్నాయా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విషయంలో ఏ ప్రభుత్వం ఏం చేసింది, సాఫ్ట్‌వేర్‌కు హైదరాబాద్ కేరాఫ్ ఎలా అయిందనే వివరాలపై పూర్తి విశ్లేషణ మీ కోసం..
దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ సాఫ్ట్‌వేర్‌కు బీజం పడింది. అందుకే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు AP CM Chandrababu ఇప్పటికీ పదే పదే అదే విషయం చెబుతుంటారు. హైదరాబాద్‌ను సాఫ్ట్‌వేర్‌కు కేరాఫ్‌గా మార్చింది తానేనంటుంటారు. అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నాన్ని ముఖ్యంగా ఏపీని ఏఐ హబ్‌గా మార్చుతానంటున్నారు. ఈ క్రమంలో అసలు వాస్తవాలేంటి, అటు హైదరాబాద్ విషయంలో ఇటు విశాఖపట్నం డేటా సెంటర్ల విషయంలో ఏ ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు లక్ష్యం సాధించాలంటే ముందున్న సవాళ్లేంటనేది వివరంగా ఓసారి పరిశీలిద్దాం.
సాఫ్ట్‌వేర్ కేరాఫ్‌గా హైదరాబాద్, ఎవరేం చేశారు
2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోయేనాటికి అప్పటికి హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ నిర్మాణం జరిగి సాఫ్ట్‌వేర్‌కు పునాది పడింది. అంటే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమల ఏర్పాటుకు బీజం పడింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. అయితే ఆ తరువాత 2004లో అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, ఆ తరువాత పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాలు, చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్ ఇప్పుడున్న స్థితికి చేరింది. ముఖ్యంగా ఓఆర్ఆర్, పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటివి ఇందులో కీలకమైనవి. అంటే హైదారాబాద్‌కు సాఫ్ట్‌వేర్ సంస్థలు తరలిరావడంలో ఈ మూడు ప్రభుత్వాల కృషి ఉంది. 2004లో చంద్రబాబు అధికారం నుంచి దిగేనాటికి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విలువ ఏడాదికి 5 వేల కోట్లుంది. ఇప్పుడు తాజాగా ఆ విలువ దాదాపుగా 3 లక్షల కోట్లకు చేరింది.
విశాఖ ఏఐ హబ్‌గా Visakhapatnam as AI Data Hub
మొన్నటి వరకు ఇండియాలో డేటా సంటర్లు ముంబై కేంద్రంగా పశ్చిమ తీరంలో కేంద్రీకృతమయ్యాయి. ఇప్పుడు ఆ డేటా సెంటర్లు తూర్పు తీరానికి ముఖ్యంగా విశాఖపట్నానికి తరలివస్తున్నాయి. హైదరాబాద్ ఏ విధంగా అయితే సాఫ్ట్‌వేర్‌కు కేరాఫ్ అయిందో అదే విధంగా రానున్న కాలంలో విశాఖపట్నం డేటా సెంటర్లకు కేరాఫ్ కానుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ క్రమంలో విశాఖపట్నం డేటా సెంటర్లకు కేరాఫ్‌గా మారనుండటంలో ఎవరి పాత్ర ఏంటి, ఏ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకుందాం..
విశాఖపట్నంలో డేటా సెంటర్లకు బీజం వేసింది గత వైసీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ Ys Jagan ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 23 వేల కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ Adani Data Center నెలకొల్పేందుకు ఎంవోయూ జరగడమే కాకుండా శంకుస్థాపన కూడా జరిగింది. ప్రభుత్వం కూడా భూమి కేటాయించింది. ఆ తరువాత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ప్రయత్నాలు కొనసాగాయి. గూగుల్-అదానీ భాగస్వామ్యంతో Google-Adani Data Center 1 గిగావాట్ సామర్ధ్యంతో అతి పెద్ద డేటా సెంటర్ స్థాపనకు ఎంవోయూ జరిగింది. 1 లక్షా 25 వేల కోట్లతో ఈ డేటా సెంటర్ నిర్మించనున్నారు. ఆ తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టి జాయించ్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ పేరుతో 98 వేల కోట్లతో ఏఐ నేటివ్ డేటా సెంటర్ స్థాపనకు ప్రకటన జారీ అయింది. ఈ ప్రాజెక్టు 20230 నాటికి ఏర్పాటు చేయవచ్చని అంచనా. డేటా సెంటర్ల ద్వారా 2 లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ వాస్తవానికి డేటా సెంటర్ల ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయే కానీ ఉద్యోగాల కల్పన తక్కువే.
డేటా సెంటర్లు..చంద్రబాబు ముందున్న సవాళ్లు Chandrababu Challenges in Setting up Data Centers
రానున్న కాలంలో డేటా సెంటర్లకు విశాఖపట్నం కేరాఫ్ కానుంది. కానీ అదే సమయంలో చంద్రబాబు లక్ష్యాన్ని సాధించాలంటే చాలా సవాళ్లున్నాయి. ముఖ్యంగా విద్యుత్, నీటి సదుపాయం. ఎందుకంటే డేటా సెంటర్లకు ప్రధానంగా కావల్సింది ఈ రెండు. 1 గిగావాట్ డేటా సెంటర్‌కు 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఇది దేశంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న ముంబై వార్షిక వినియోగం 4 వేల మెగావాట్లలో సగం. ఇక ఏపీ వార్షిక విద్యుత్ వినియోగం 2023 నాటికి 12, 659 మెగావాట్లుగా ఉంటే 2024 మే నాటికి అది కాస్తా 13, 319 మెగావాట్లకు పెరిగింది. తాజాగా మరింత పెరిగి ఉంటుంది. ఈ క్రమంలో అంత భారీగా విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ప్రధానమైన ప్రశ్న.
ఇక రెండవది అపరిమిత నీటి వినియోగం. విద్యుత్ అనేది రినవెబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఆయా కంపెనీలు చాలా వరకు సమకూర్చుకుంటాయని ప్రభుత్వాలు చెబుతున్నా నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది మరో ప్రధాన ఛాలెంజ్. ఎందుకంటే విశాఖపట్నంలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ఉంది. ప్రస్తుతానికి ఏలేరు ద్వారా తాగు నీరు అందుతోంది. భవిష్యత్తులో పోలవరం కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల నీరు అందించే ప్రతిపాదన ఉంది. 1 గిగావాట్ డేటా సెంటర్‌కు ఏడాదికి 18 మిలియన్ గాలన్ల నీరు అవసరం. రోజుకు లెక్కేస్తే 50 మిలియన్ గాలన్లు. ఇది ఎంతంటే 5-6 లక్షల జనాభా ఉన్న రాజమండ్రి, వరంగల్, తిరుపతి నగరాల రోజువారీ నీటి అవసరాలన్నమాట. ఇంత పెద్దమొత్తంలో నీరు ఎలా సమకూర్చుతానేది మరో ప్రదానమైన సవాలుగా ఉంది.
మరి ఈ సవాళ్లను దాటి విశాఖను ఏఐ హబ్‌గా మార్చడం సాధ్యమేనా. ఇదే ఇప్పుడు చంద్రబాబు AP Data Hub Challenges ముందున్న అసలు సవాలు.

