దేశంలోనే వృతి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏపీ పోలీస్ అధికారులను అభినందించారు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి. మధ్యప్రదేశ్ భోపాల్ లో ఐదు రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటి మీట్-2022 లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వృతి నైపుణ్యంలో 6 మెడల్(2 gold, 3sliver, 1 bronze) తో భారతదేశంలోనే అత్యధిక మేడల్స్ గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణం, కాంస్యం, రజిత పతకాలు సాధించిన ఎపి పోలీస్ అధికారుల బృంధాన్ని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.
11 విభాగాల్లో దేశంలోని 24 రాష్ట్రాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన మొత్తం 28 టీంతో సుమారు 2000 మందికి పైగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఐజి ఎల్.కే.వి రంగారావు, క్రీడలు & సంక్షేమం నేతృత్వం లోని అధికారులతో కూడిన బృందం ఇందులో పాల్గొన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు పతకాలు సాదించిన విజేతలకు నగదు బహుమతిని అందించారు. స్వర్ణ పతక విజేతలకు 10,000, రజత పతక విజేతలకు 8,000, కాంస్యం పతక విజేతలకు 5,000 నగదు బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు.
అంతే కాకుండా పోలీస్ శాఖలో వృతి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకి మరియు పతకాలు సాదించిన విజేతలకి పోలీస్ శాఖ నుండి ప్రత్యేకంగా స్వర్ణ పతాకం సాదించిన విజేతకు 3,00,000 లక్షల నగదు(మూడు ఇంక్రిమెంట్లు) కాంస్యం పతక విజేతలకు 2,00,000 లక్షల నగదు(రెండు ఇంక్రిమెంట్లు), రజిత పతక విజేతలకు 1,00,000 లక్షల నగదు (ఒక ఇంక్రిమెంట్) ల నగదు బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు.
AP: పోలీస్ డ్యూటీ మీట్ లో ఏపీకి పతకాల పంట
సంబంధిత వార్తలు | RELATED ARTICLES