ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికు, స్థానిక ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ 1950 వరకు బ్రిటీషర్స్ తయారు చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆధారంగానే చట్టాలు నడిచేవి. డా.బి.ఆర్.అంబేద్కర్ సారథ్యంలో తయారు చేసిన రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. ఈ గొప్ప విజయాన్ని రిపబ్లిడేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపారు.
అనేక మంది దేశభక్తుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు, యోధులకు నివాళులు అర్పించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రతిఒక్కరు తమపనిని సక్రమంగా నిర్వర్తించి భావితరాలకు స్వేచ్ఛను అందించాలని కోరారు. సేవా దృక్పధంతో పనిచేస్తున్న విపత్తుల నిర్వహణ సంస్థ ఉద్యోగులను అభినందించారు.
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో విపత్తుల నిర్వహణ సంస్థ ఈడీ డా.సి.నాగరాజు, ఏవో దీపక్, SDRF ఆర్ఎస్సైలు, ఫైర్ ఆఫీసర్లు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.