Homeఆంధ్రప్రదేశ్Protest : మడకశిరలో మంటలు రేపిన మలిదశ దీక్షలు.. డీఎస్సీ లీకేజీపై సమరశంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ!

Protest : మడకశిరలో మంటలు రేపిన మలిదశ దీక్షలు.. డీఎస్సీ లీకేజీపై సమరశంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ!

మడకశిర (తెలుగు ప్రభ): డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, డీఎస్సీ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా గురువారం మడకశిరలో మొదటి రోజు కార్యక్రమాన్ని చేపట్టారు.

- Advertisement -

మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌.ఎల్‌. ఈరలక్కప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్ష కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వై.సి. గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర వక్కలిగ విభాగ అధ్యక్షులు రంగేగౌడ్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి రామారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి నాగభూషణ రెడ్డి, మండల కన్వీనర్ కళ్ళుమరి శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, అమరాపురం మండల కన్వీనర్ త్రిలోక్‌నాథ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీకి చెందిన జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై దీక్షకు మద్దతు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News