Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ఎల్లుండి ఉద్యోగసంఘాల జెఎసితో అగ్రిమెంట్

AP: ఎల్లుండి ఉద్యోగసంఘాల జెఎసితో అగ్రిమెంట్

8 శాతం ఫిట్ మెంట్ కు అంగీకారం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగసంఘాల జెఎసితో సచివాలయంలో ప్రభుత్వం జరిపిన చర్యలు ఫలించాయని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సిఎస్ లు విజయానంద్, ఎస్ఎస్ రావత్ తదితరులతో కలిసి మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.

- Advertisement -

ఉద్యోగ సంఘాల జెఎసితో జరిగిన చర్యలు సఫలమయ్యాయి. గురువారం నుంచి వారు చేపట్టబోయే సమ్మెను విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలకు చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. సమ్మెను విరమించేందుకు అంగీకరించారు. 8 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన పలు అంశాలపై కూడా సామరస్యపూర్వకంగా చర్చలు జరిగాయి. పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేసింది. ఈ చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై ఎల్లుండి ఉద్యోగ సంఘాల జెఎసితో ఒప్పందం చేసుకుంటాం. ఈ చర్చల్లో ప్రభుత్వం తరుఫున పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అలాగే చర్చల్లో పాల్గొని సహకరించిన జెఎసి ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News