రాష్ట్రంలో ఇకపై పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డు దారులకు ఫోర్టిఫైడ్ గోధుమపిండి సరఫరా చేయనుంది జగన్ సర్కారు. ఒక్కో రేషన్ కార్డుపై కిలో గోధుమ పిండి సరఫరా చేయనున్నట్టు పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వెల్లడించారు. కిలో రూ.16 వంతున రేషన్ కార్డు దారులకు జూలై నుంచి సరఫరా చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. విజయనగరంలో జరుగుతున్న పౌరసరఫరాల అధికారుల ప్రాంతీయ సదస్సులో మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి ఫోర్టిఫైడ్ గోధుమపిండిని విడుదల చేసిన మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎం.డి.వీరపాండ్యన్, విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల జాయింట్ కలెక్టర్ లు పాల్గొన్నారు.
AP ration: ఫోర్టిఫైడ్ గోధుమపిండి సరఫరా
కిలో 16 రూపాయలకు రేషన్ కార్డు దారులకు ఫోర్టిఫైడ్ గోధుమ పిండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES