Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: మహిళా ప్రజాప్రతినిధుల వర్క్ షాప్ లో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

AP: మహిళా ప్రజాప్రతినిధుల వర్క్ షాప్ లో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

జాతీయ మహిళా కమిషన్ ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సంయుక్త ఆధ్వర్యంలో జెండర్ రెస్పాన్సివ్ గవర్నర్స్ పేరుతో మూడవ రోజు జరుగుతున్న మహిళ ప్రజా ప్రతినిధుల వర్క్ షాప్ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ,కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన సహచర ఎమ్మెల్యేలతో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. వర్క్ షాప్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం గర్వకారమన్నారు. ఏపీలో ప్రతి మహిళ అక్క చెల్లెమ్మలకు వారి బాగోగులకు జగనన్న సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేశారు శ్రీదేవమ్మ. నిజమైన మహిళా సాధికారత దిశగా ఏపీని ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారు అని పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ మహిళా జాతీయ ప్రజా ప్రతినిధుల సదస్సులో ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News