AP Google AI Hub MoU : ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ముందడుగు వేసింది. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం రూ.88,628 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ రోజు ఢిల్లీలో తాజ్‌మహల్ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఒప్పందాల మార్పిడి జరిగింది. ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే పాల్గొన్నారు.
ALSO READ: Tourist Police: పర్యాటక ప్రాంతాల్లో పోలీసుల పహారా – టూరిస్టులకు ఇక లేదు బెడద!
ఈ ఒప్పందం ‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రంగా నిలుస్తుంది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించే అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇది. 2028-2032 మధ్య పూర్తవుతుంది. రాష్ట్ర GDPకు ఏటా రూ.10,518 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పడతాయి. విశాఖ నగరం పూర్తిగా ‘ఏఐ సిటీ’గా మారుతుంది. విద్యుత్, రియల్ ఎస్టేట్, టెలికాం రంగాలు అభివృద్ధి చెందుతాయి.
గతేడాది అక్టోబర్‌లో లోకేశ్ అమెరికా పర్యటనలో గూగుల్ సీఈఓ కురియన్‌తో చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి పన్నుల ఆదాయం, ఆర్థిక వృద్ధికి బలం. చంద్రబాబు “ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మారుస్తాము” అని చెప్పారు. వైష్ణవ్ “స్వదేశీ టెక్ ప్రోత్సాహం” అని మద్దతు తెలిపారు. సీతారామన్ “ఇది రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి” అన్నారు. ఈ MoU ‘విశ్వక కల్ప’ విజన్‌కు సరిపోతుంది.


