Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గోరుముద్దలో రాగి జావ ప్రోగ్రాం ప్రారంభం

AP: గోరుముద్దలో రాగి జావ ప్రోగ్రాం ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయంపూట రాగి జావ అందించే కార్యక్రమాన్నిసీఎం జగన్ ప్రారంభించారు.  జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ ఇస్తారు.  ఏటా మరో 86 కోట్లు ఈ కార్యక్రమం కోసం అదనంగా ఖర్చు కానున్నాయి. దీంతో మొత్తం 1,910 కోట్లు గోరుముద్ద కార్యక్రమానికి ప్రతి ఏటా వెచ్చించాల్సి వస్తుందన్నమాట.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి. వీరపాండియన్, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా ఇతర ఉన్నతాధిరులు హాజరయ్యారు.

డిజిటలైజ్ అయిన క్లాసుల్లో 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు డిజిటల్ క్లాసు రూముల్లో బోధన ఉంటుందని సీఎం వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News