Nominated Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మరో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టింది. తాజా ఉత్తర్వుల్లో మొత్తం 31 నామినేటెడ్ పోస్టులకు నియామకాలు జరిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు తదితర సంస్థల్లో పలువురు నేతలను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రకటించిన జాబితాలోనూ రాజకీయ పార్టీలకు చెందిన అనేక నేతలకు అవకాశం కల్పించారు.
ఈ నియామకాలలో రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆకేపోగు ప్రభాకర్ (కొడుమూరు–ఎస్సీ), సామాజిక సంక్షేమ బోర్డుకు బాల కోటయ్య (నందిగామ–ఎస్సీ), కమ్మ కార్పొరేషన్‌కు బ్రహ్మం చౌదరి (గురజాల), బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు బుచ్చి రాంప్రసాద్ (గుంటూరు వెస్ట్), ముదలియార్ అభివృద్ధి కార్పొరేషన్‌కు సి.ఎస్. త్యాగరాజన్ (చిత్తూరు), బొందిలి కార్పొరేషన్‌కు డి.విక్రమ్ సింగ్ (కర్నూలు) నియమితులయ్యారు. వీరిలో చాలామంది టీడీపీకి చెందిన వారు ఉన్నారు.
ఇక హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) కోసం దాసరి శ్రీనివాసులు (తిరుపతి – బీజేపీ), వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్‌కు గుంటసల వెంకట లక్ష్మి (దెందులూరు – జనసేన), ఆరె/కటిక సంఘానికి హరికృష్ణారావు హనుమంతకరి (తాడిపత్రి), విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు కమ్మరి పార్వతి (పాణ్యం), వక్కలిగ సంక్షేమ సంఘానికి లక్ష్మీనారాయణ (మడకశిర – ఎస్సీ) నియామకమయ్యారు.
అలానే నగరాలు కార్పొరేషన్‌కు మరుపిల్ల తిరుమలేశ్వరరావు (విజయవాడ వెస్ట్), పాలెగారు–కవలి వర్గ సంక్షేమ సంఘానికి నాగేశ్వర నాయుడు కందూరి (రాయచోటి), నూర్‌బాషా / దూదేకుల కార్పొరేషన్‌కు నాగుల్ మీరా కాసునూరి (విజయవాడ వెస్ట్), కురాకుల–పొందర కార్పొరేషన్‌కు నరసింహులు దామోదర (నరసన్నపేట), వికలాంగులు–వృద్ధుల సహాయ కార్పొరేషన్‌కు నారాయణ స్వామి (రాప్తాడు), కనీస వేతన సలహా బోర్డుకు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి (కోవూరు) నియమితులయ్యారు.
ఇతర నియామకాల్లో మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రకాశ్ నాయుడు (సింగనమల – ఎస్సీ), తెలుగు–సంస్కృత అకాడమీకి ఆర్.డి. విల్సన్ (నెల్లూరు సిటీ – బీజేపీ), సగర/ఉప్పర సంక్షేమ కార్పొరేషన్‌కు ఆర్.వెంకట రమణప్ప (పెనుకొండ), నాగవంశం కార్పొరేషన్‌కు రామనారాయణ రావు ఎరుబోతు (విజయవాడ సెంట్రల్), కళింగ కోమటి కార్పొరేషన్‌కు రమేష్ మొదలవలస (ఆమదాలవలస), సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీకి రవి మందలపు (రాజమహేంద్రవరం సిటీ), బీసీ సహకార కార్పొరేషన్‌కు రెడ్డి అనంత కుమారి (కొత్తపేట) నియమితులయ్యారు.
బెస్త కార్పొరేషన్‌కు శ్రీధర్ బొమ్మన (సూళ్లూరుపేట – ఎస్సీ), ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకీ షేక్ రియాజ్ (ఒంగోలు – జనసేన), జానపద కళలు & సృజనాత్మకత అకాడమీకి వంపూరు గంగులయ్య (పాడేరు – ఎస్టీ – జనసేన), వీరశైవ లింగాయత కార్పొరేషన్‌కు స్వప్న (అనంతపురం అర్బన్), కృష్ణబలిజ కార్పొరేషన్‌కు త్రిమూర్తులు గంటా (భీమవరం), జంగం కార్పొరేషన్‌కు వి. చంద్రశేఖర్ (పీలేరు), దాసరి సంక్షేమ సంఘానికి వెంకట రత్నాజీ పొట్నూరు (శృంగవరపుకోట) వంటి నాయకులకు అవకాశం కల్పించారు. ఈ నియామకాలతో రాష్ట్రంలోని సామాజిక వర్గాల పాలుపంచుకునే అవకాశాలు పెరిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. పార్టీ, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.


