ఏపీ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు(Women Employees) శుభవార్త అందించింది. మాతృత్వ సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న 120 రోజులు మెటర్నిటీ సెలవులను 180 రోజులకి పెంచుతూ జీవో విడుదల చేసింది. గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తించేవి. కానీ తాజా జీవోలో ఆ నిబంధన కూడా ఎత్తివేసింది. ఎంతమంది పిల్లలను కన్నా యతావిథిగా సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
తాము అధికారంలోకి వస్తే మెటర్నిటీ సెలవులు పెంచుతామని కూటమి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహిళలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంపై మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.